ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ కూడా ఒకటి. ఆళ్లగడ్డ టీడీపీ నుంచి భూమా అఖిల ప్రియ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి పోటీ చేయనున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మరోసారి భూమా, గంగుల కుటుంబాలు పోటీ పడుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. 2019 సంవత్సరంలో గంగుల బ్రిజేంద్ర రెడ్డి తొలిసారి వైసీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
 
భూమా అఖిలప్రియ విషయానికి వస్తే 2014 సంవత్సరంలో తల్లి మరణం వల్ల ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిల ప్రియ 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. పలు వివాదాల ద్వారా భూమా అఖిలప్రియ నిలిచారు. అటు అఖిల ప్రియ ఇటు బ్రిజేంద్ర రెడ్డి ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గ నేతలు కావడం గమనార్హం. అఖిల ప్రియ, బ్రిజేంద్ర రెడ్డి వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందడుగులు వేస్తున్నారు.
 
గంగుల బ్రిజేంద్ర కమీషన్లు తీసుకుని పాలన సాగిస్తున్నారని అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేస్తుండగా ఆ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆరోపణలు ప్రూవ్ చేసి మాట్లాడాలని బ్రిజేంద్ర రెడ్డి చెబుతున్నారు. భూమా అఖిలప్రియకు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండటం ఆమెకు మైనస్ అవుతోంది. ఆళ్లగడ్డలో వైసీపీకే అనుకూల ఫలితాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.
 
మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటేస్తారో చూడాల్సి ఉంది. ఆళ్లగడ్డలో ఏ పార్టీ గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గెలుపు కోసం ఇద్దరు నేతలు తెగ కష్టపడుతున్నారు. మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని బ్రిజేంద్ర చెబుతుండగా తానే ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని అఖిలప్రియ భావిస్తున్నారు. ఆళ్లగడ్డ ఓటర్ల మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీపై టీడీపీ పైచేయి సాధించాలని టీడీపీ నేతలు తెగ
 కష్టపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: