ఇండస్ట్రీలో ఒకప్పుడు రోజా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా రాజకీయాల్లో అడుగుపెట్టి చివరికి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టింది. అలాంటి రోజా మంత్రిగా చేస్తున్న సమయంలో బాగానే కమాయించిందని  కమెడియన్ కిరాక్ ఆర్పి  అన్నారు. ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజాపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఒక క్రిస్టియన్ అని, ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 3000 కోట్ల వరకు దొబ్బేసిందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు  ఆమె మంత్రిగా ఉన్నప్పుడు తన ఇద్దరు బ్రదర్స్ ఎన్నో  వ్యవహారాల్లో వేలు పెట్టి డబ్బులు సంపాదించారని తెలియజేశారు.. మరి ముఖ్యంగా తిరుమల గోశాలలో గోవులు చనిపోయినప్పుడు  వైసిపి పెద్ద ఎత్తున ఆందోళన చేసి  తిరుమలలో నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్యపై రోజా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. పవన్ కళ్యాణ్ డబ్బులకు రుచి మరిగాడంటూ రోజా మాట్లాడారు.. ఈ మాటలకు కౌంటర్ గా కిరాక్ ఆర్పి స్పందిస్తూ .. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నువ్వు ఉండి డబ్బులకు రుచి మరిగావని, మీ అన్నదమ్ములను అడ్డం పెట్టుకొని 3000 కోట్లకు పైగా రూపాయలు అడ్డగోలుగా సంపాదించావని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉంటూ ఈమె ఎప్పుడో క్రిస్టియన్ గా మారిపోయిందని  అన్నారు..

ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేయడం లేదని, తన కొడుకు అనారోగ్యంగా ఉన్నాడని , వాళ్లు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ భార్య తిరుమలలో తలనీలాలు ఇచ్చి అక్కడ ఉన్న వారందరికీ అన్నదానం చేసిందని  స్పష్టం చేశారు. అలాంటి వారిపై రోజా ఇలా మాట్లాడడం దారుణమని ఖండించారు. ప్రస్తుతం కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ అభిమానులు రోజాపై విపరీతంగా విరుచుకుపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: