
అయితే ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్తాన్ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. లాహోర్ అలాగే సీయోల్ కోట్ ఎయిర్పోర్టులు కూడా బంద్ చేసింది పాకిస్తాన్. ఇస్లామాబాద్ అలాగే రావల్ పిండి లో మెడికల్ ఎమర్జెన్సీ నెలకొంది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇలా పాకిస్తాన్ పై ప్రతికారం తీర్చుకుంటుంది ఇండియా.
అయితే... పాకిస్తాన్ పై దాడి చేసిన నేపథ్యంలో... ఆ దేశ ప్రధాని షరీఫ్ స్పందించారు. ఇండియాను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసు అని ఈ సందర్భంగా పోస్ట్ పెట్టారు. కచ్చితంగా ఇండియాకు కౌంటర్ ఇస్తామని... హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలపై అటు అమెరికా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇండియా దాడి చేసిందని మీరు కూడా దాడి చేయకండి అని కోరింది. ఒకవేళ మీరు దాడులు చేస్తే... పాకిస్తాన్ సర్వనాశనం కావడం గ్యారంటీ అంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టి కి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు