
1 ) ఆపరేషన్ సింధూర్ లో భారత అభిమానికి దళం సైన్యం నౌకాదళం కలిసి పని చేశాయి.
2 ) డ్రోన్లు రాఫెల్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ భూభాగంపై భారత సైన్యం దాడులు జరిపింది.
3 ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను పర్యవేక్షించారు.
4 ) పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి విజయవంతమైందని సైన్యం ప్రకటించింది.
5 ) మురిద్కే లో ని లష్కర్ ఏ తోయిబా స్థావరం పూర్తిగా ధ్వంసం అయింది.
6 ) బహబల్పూర్ లో జేషే మహమ్మద్ స్థావరం కూడా పూర్తిగా ధ్వంసం అయింది.
7 ) అమెరికా - బ్రిటన్ - సౌదీ అరేబియా - యూఏఈ - రష్యా వంటి దేశాలకు భారత్ ఇప్పటికే యుద్ధం గురించి పూర్తి సమాచారం అందించింది.
8 ) దాడులు తర్వాత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అమెరికా ఎన్ఎస్ ఏ తో పాటు అక్కడ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడారు.
9 ) పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ శాఖ మంత్రి ఇస్సాక్ ధార్ భారత్ దాడిని ఖండించారు
10 ) శ్రీనగర్ - జమ్మూ కాశ్మీర్ - లే - చండీగఢ్ - ధర్మశాల విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు పూర్తిగా కొద్ది రోజులు పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
భారత దాడుల లక్ష్యం ఉగ్రవాదుల నిర్మూలన మాత్రమే అని పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని స్పష్టం చేసింది.