
ఆంధ్రాలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 21 సీట్లు తప్ప మిగిలిన వాటిలో ఎక్కడ కూడా జనసేన పార్టీకి ప్రాధాన్యత కనిపించడం లేదు. ప్రస్తుతం అధికారం ఉన్నప్పటికీ పార్టీని ఇతర చోట్ల పటిస్తం చేయడానికి ఎందుకో జనసేన పార్టీ ఆలోచిస్తుందట. ఇతర పార్టీలలో నుంచి జనసేన పార్టీలోకి రావడానికి చాలామంది నేతలు మక్కువ చూపిస్తున్నారని వార్తలనిపిస్తున్న కానీ జనసేనలో మాత్రం చేరికల పరిస్థితి ఇప్పుడు అసలు కనిపించడం లేదు.
ముఖ్యంగా పార్టీలోకి కొత్తవారు వస్తే కచ్చితంగా గొడవలతో పాటు వర్గ పోరు కూడా మొదలవుతుందని దీనివల్ల విభేదాలు కూడా తలెత్తుతాయని జనసేన పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందట.అందుకే చాలామంది టిడిపి పార్టీలోకి వెళుతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల జనసేన పార్టీలో చేరిన కీలకమైన నేతలు కూడా పార్టీలో ఉండలేకపోతున్నారని.. కేవలం పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ తో మీటింగ్ కూడా దొరకడం కష్టంగా మారిందని చెబుతున్నారట. చాలామంది నేతలు కూడా తమకు గుర్తింపు లేదని బాధపడుతున్నారట. జనసేన పార్టీని విస్తరింపజేసుకొని 2029లో సింగిల్గా పోటీ చేస్తుందా లేకపోతే కనీసం 70 స్థానాలనైన పోటీ చేస్తుందా అనే సందేహం జనసేన నేతలలో కార్యకర్తలను మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.