
కేవలం ఉగ్రవాదులు వారి స్థావరాలను నాశనం చేసినట్లుగా తెలియజేసింది భారత్. ఇదే విషయాలను సైతం అన్ని ప్రపంచ దేశాలకు కూడా తెలిసేలా తెలియజేసింది. అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ లో 14 మంది పాక్ సైనికులు హతమైనట్లుగా తెలుస్తోంది. ఒకవైపు భారత్ తో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ మరొకవైపు బలోచ్ లిపిరేషన్ ఆర్మీ.. కూడా పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తున్నదట. తాజాగా BLA ఒక స్పెషల్ ప్రాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ ఆర్మీ వాహనం పైన రిమోట్ కంట్రోల్ తో బాంబు పేల్చిందట.
ఈ దాడిలో సుమారుగా 12 మంది పాకిస్తాన్ జవాన్ల సైతం మరణించారు. అలాగే మరొక దాడిలో ఇద్దరు జవాన్లు మరణించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పాకిస్తాన్ కి అటు ఇండియాతో పాటుగా BLA చుక్కలు చూపిస్తోంది. మరి ఇలాంటి నడుమ పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.. ఇప్పటికే పాకిస్తాన్ లో పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితికి మారిపోయాయనే విధంగా పలు రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. పాకిస్తాన్ కి మద్దతుగా టర్కీ, అజర్ బైజన మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ పాకిస్తాను మాత్రం ఫేక్ న్యూస్ తో ఇండియా మీద కొన్ని దాడులు చేశామంటూ పలు రకాల రూమర్స్ సృష్టిస్తున్నారు.