-  ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . . . .

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  కొత్త పార్టీ పెట్టబోతుందని జరుగుతున్న ప్రచారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎంపీ రఘునందన రావు .. జూన్ 2 న కవిత కొత్త పార్టీ పెట్టబోతుంద ని ఆయన వ్యాఖ్యానించారు .. తన పార్టీ ప్రకటన అనంతరం షర్మిల తరహా లోనే కవిత తెలంగాణ లో పాదయాత్ర చేస్తుందని కూడా అంటున్నారు ..



ఇదే సమయం లో కవిత రాజకీయం గా వేస్తున్న అడుగుల పై కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు రఘునందన్ రావు .. కెసిఆర్ దేవుడు ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయ ని కవిత చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ .. దేవుడు , దెయ్యాల పక్కన 12 ఏళ్లు గా మీరేం చేస్తున్నార ని నిలదీశారు ..



అలాగే బిఆర్ఎస్ పార్టీ కాళీ కాబోతుందని భయం తోనే ఈ నాటకం మొదలు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు .. ఒకరి తో గొడవ , పడకపోతే మరొకరు దగ్గరికి వెళ్లి ఇలాంటి గ్రూపులు క్రియేట్ చేయ‌టం మొదలు పెడుతున్నారు .. అలాగే మాట్లాడుకోవాలనుకుంటే తండ్రి కూతురు మధ్య మధ్యవర్తి  ఎందుకు వస్తారు .. అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు .. ఇక మరి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబం లో ఇంకెన్ని పెను మార్పులు వస్తుంయో చూడాలి .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా  ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: