
వాస్తవంగా అధికారపక్షం నుంచి బయటికి రావడం అనేటువంటిది చిట్టచివరిలో జరుగుతూ ఉంటుంది. వైయస్సార్సీపి పార్టీ విషయానికి వస్తే గత ఏడాది అటు శ్రీదేవి కావచ్చు కోటంరెడ్డి కావచ్చు చాలామంది నేతలు బయటికి వెళ్లారు. అదే సందర్భంలో ఫస్ట్ ఒకటి రెండేళ్ల లలో కూడ వల్లభనేని వంశీ, మద్దాల గిరి అలా కొంతమంది నేతలు వైసీపీలోకి వచ్చి చేరారు. చివరిలో కొంతమంది వైసీపీ నుంచి టిడిపి పార్టీలోకి వెళ్లారు ఎమ్మెల్యేలు. చివరి నిమిషంలో మనకి సీటు దక్కదు అనుకున్నప్పుడు ఆ స్థాయిలో ఇతర పార్టీలలో ఆశించే వెళ్లడం సాధారణంగా మారిపోయింది నాయకులకు.
టిడిపి పార్టీ వచ్చి ఏడాది అవుతూ ఉన్న ఇంకా సంబరాలు చేసుకోబోతున్న సమయంలోనే సుగవాసి రాజీనామా అన్నది కీలకమౌతోంది. ఈ నేత వైసిపి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారా అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు తెరమీదకి వచ్చింది. రాయచోటి నియోజకవర్గం ప్రజలు , సుగవాసి అభిమానులు సూచనలు మేరకే టిడిపి పార్టీకి రాజీనామా చేసినట్లుగా మీడియాతో తెలియజేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన తండ్రి సుగవాసి పాలకొండ రాయుడు రాజంపేట ఎంపీగా , రాయచోటి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిచారని పార్టీని 40ఏళ్లకు పైగా అభివృద్ధిలో కృషి చేశారని తెలియజేశారు.. ఆయన చనిపోతే పార్టీ అధినేతలకు కనీస గౌరవం ఇవ్వకపోవడం చాలా బాధాకరమని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా కుటుంబానికి గుర్తింపు ఇవ్వకపోవడమే కాకుండా అవమానక పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలియజేశారట. ప్రజల కోసమే పరిపాలన అన్నట్టుగా చేస్తారు.. అందరితోనూ చర్చించి ఏ పార్టీలో చేరేది అన్నది ప్రకటిస్తానని తెలిపారు సుగవాసి.