
మరొక ముగ్గురు పరిస్థితి వవిషమంగానే ఉందని తెలుపుతున్నారు. అయితే ఈ మృతులందరూ కూడా చిత్తూరు ప్రాంతానికి చెందిన వారే అన్నట్లుగా తెలియజేస్తున్నారు. తిరుపతి నుంచి ap 03Z 0190 నెంబర్ బస్ బెంగళూరుకి వెళ్తూ ఉండగా కోలారు జిల్లా హోసాకోట్ లోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యిందని.. క్షతగాత్రులను స్థానికంగా దగ్గరలో ఉండే ఒక ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు.
మృతుల వివరాల విషయానికి వస్తే..
1). కేశవరెడ్డి 44 ఏళ్ళు
2). ప్రణతి-ఐదేళ్లు
3). తులసి 21 ఏళ్లు
ఏడాదిన్నర వయసు ఉన్న మరొక పాప మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.. మరి ఈ విషయం పైన అటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించి మరణించిన కుటుంబాలకు ఏ విధంగా సహాయం చేస్తుందో చూడాలి. అలాగే ఈ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలిన ప్రయాణికులకు ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేపడుతుందనే విషయం తెలియాల్సి ఉన్నది.. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నియోజవర్గం అయిన చిత్తూరు జిల్లా వాసులే మృతి చెందారు.