సీనియర్ జర్నలిస్టు అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ను బెయిల్ పై విడుదల  చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ల ధర్మాసనం తెలిపిన వివారాల ప్రకారం చూస్తే.. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వ్యాఖ్యానించింది. డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాస రావు నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అంటూ మొట్టి కాయలు వేసింది. కోర్టు విచారణ సమయం లో మేము కూడా నవ్వుతామని, దాన్నిబట్టి అరెస్టులు చేయడం సరికాదని తెలియజేసింది. ఆయనను తెలంగాణ లో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేయడం  ఏంటని ప్రశ్నించింది.

 ఇప్పటి వరకు కొమ్మినేని శ్రీనివాస రావు పై ఎలాంటి నేర చరిత్ర లేదని తెలియపరుస్తూ సుప్రీం కోర్టు ధర్మాసరం బెయిల్ మంజూరు చేయడంతో వైసీపీ శ్రేణులకు సరికొత్త బూస్టింగ్ ఇచ్చినట్టు అయింది. సాధారణంగా అరెస్ట్ అయిన తర్వాత చాలామందికి ముందస్తుగా బెయిల్ రాదు. అందులో 100కు 98 మందికి బెయిల్ దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఈ కేసులో మాత్రం కొమ్మినేని శ్రీనివాసరావు కేసును పక్కనపెట్టి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో జగన్ పార్టీ శ్రేణులకు సరికొత్త ఊరట లభించింది. ఆయన బెయిల్ పై రావడంతో జగన్ మొదలు చాలా మంది నేతలు స్పందించారు.

 వాక్ స్వాతంత్ర్యం హక్కును కాపాడాలని రాష్ట్రంలో ఇలాంటి జర్నలిస్టు,మీడియాలపై కేసులు పెట్టించి అరెస్ట్ చేయడం బాగాలేదని సుప్రీంకోర్టు టిడిపికి షాక్ ఇచ్చింది. ఇక ఆయనకు బెయిల్ రావడంతో వైసీపీ లో సరికొత్త ఊపిరి వచ్చింది జగన్మోహన్ రెడ్డితో పాటు చాలామంది నేతలు, సంబరాలు చేసుకున్నారు. టిడిపి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పును వారు  అభినందించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు  సరికొత్త బూస్టింగ్ ఇచ్చినట్టయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: