
కానీ ఈ ఘటనకు జగన్ కాన్వాయ్ కి ఎలాంటి సంబంధం లేదని అప్పటివరకు పోలీస్ అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఒక ప్రైవేటు వాహనం ఢీ కొనడం వల్లే సింగయ్య మరణించారనే విధంగా వెల్లడించారు. కానీ తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియోల ఆధారంగానే జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు కిందే సింగయ్య పడి మరణించినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కొన్ని మీడియా సంస్థలు తెలియజేశాయి.. కారు ముందు టైరు భాగంలో సింగయ్య మెడ పైనుంచి వెళుతున్నట్లుగా దృశ్యాలను వైరల్ గా చేశారు. దీంతో మరొకసారి ఈ కేసు కీలకమైన మలుపు చోటు చేసుకున్నది.
పోలీసులు ఈ ఘటన పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు గా మరి కొంతమంది వైసిపి నేతల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే ఇలాంటి సమయంలోనే సింగయ్య కు సంబంధించి తాజా ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంతమంది విడుదల చేశారు వైసిపి కార్యకర్తలు. జగన్ కాన్వాయ్ ప్రమాదం తర్వాత సింగయ్య బాగానే ఉన్నారని ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్నది.. అంతేకాకుండా అంబులెన్స్ వచ్చిన సమయంలో కూడా సింగయ్య తన కాలు మీద కాలు వేసుకుని మరి కనిపించడం గమనార్హం. కానీ సింగయ్య విషయంలో ఏదో తప్పు జరిగింది కుట్ర జరిగింది ఆ విషయాన్ని ప్రభుత్వం దాస్తోంది అంటూ కొంతమంది వైసిపి కార్యకర్తలు నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు.