
ఈ విషయం విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. విచారణకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకా, దీని వెనుక ఎవరి హస్తం ఉన్నా ఘనత వహించినవారైనా వదలరాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని పబ్లిక్‌లోకి తీసుకెళ్లాలన్న బాధ్యతను కూటమి నేతలకు అప్పగించారు. ఈ ఆరోపణలపై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ తేలికగా స్పందించారు. “ఇలాంటివి మా హయాంలో కూడా వచ్చాయి.. మేమేమైనా ఆగిపోయామా?” అంటూ విమర్శల్ని తిప్పికొట్టారు. ఒక మెయిల్ వల్ల రుణాలు ఆగిపోతాయా? అంటూ వ్యంగ్యంగా స్పందించారు. బుగ్గన వ్యాఖ్యలకు తక్షణమే కౌంటర్ ఇచ్చిన పయ్యావుల కేశవ్: “ఇది పెట్టుబడి రాకపోవడం కాదు – రాష్ట్ర ప్రతిష్టకు దెబ్బ !” గతంలో 2024 మార్చిలో 7 వేల కోట్ల రుణం కోసం ycp ప్రభుత్వం ప్రయత్నించగా, విశ్వాసం లేక రుణం అందలేదని గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని దేశద్రోహ చర్యగా గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరినట్లు వెల్లడించారు
ఈ ఘటన వెనుక వైసీపీ తరహా పన్నాగమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ చర్య అదానీ గ్రూప్‌పై వచ్చిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ లా, ఏపీ ప్రభుత్వ నాణ్యతపై అనుమానాలు రేకెత్తించే ప్రయత్నమని అంటున్నారు. దీన్ని రాష్ట్ర అభివృద్ధిని బ్లాక్ చేసే రాజకీయ నేర చర్యగా గుర్తించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. విదేశాల్లో ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ హ్యారాస్మెంట్, కేటాయింపులపై తప్పుడు ప్రచారం కేసులపై తీవ్ర శిక్షలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కంపెనీల ఉద్యోగులు, ఇలాంటి అనైతిక మెయిల్ స్కాంపై ఉద్యోగాలు కూడా కోల్పోయిన కేసులు ఉన్నాయని సూచిస్తున్నారు. కేసు వెనుక ఎవరి ప్రమేయముందో విచారణ తర్వాతే స్పష్టత రానుంది.
కానీ ఈ విషయంలో రాష్ట్ర ఆర్థిక పరువు, పెట్టుబడుల పట్ల దేశ, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకమే ఇన్వాల్వ్ కావడంతో దీన్ని చిన్నగా తీసుకోవడం లేదు. ఈ మెయిల్ స్కాంపై ఎఫ్‌ఐఆర్ నమోదు, విదేశీ ఐపీ అడ్రెస్సులు ట్రేసింగ్, డిజిటల్ ఫోరెన్సిక్ చర్యలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే కుట్రల పట్ల ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలన్న ప్రజా అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇది రాజకీయ ఆరోపణల స్థాయిని దాటి “రాష్ట్ర విఘాతం” అనే కోణానికి చేరుతోంది. సీఎం చంద్రబాబు దీనిపై కటిన విచారణకు శ్రీకారం చుట్టడం, దర్యాప్తు ఎటు వెళుతుందో చూడాల్సిందే.