
కూటమి సర్కారు వచ్చిన తర్వాత వాలంటరీల వ్యవస్థను పూర్తిగా సైడ్ చేశారని వాలంటరీ సేవలు కాకుండా పెన్షన్లను సచివాలయ ఉద్యోగులతోనే ఇప్పిస్తున్నారు. రేషన్ బండ్లు లేకుండానే సరుకులను పంపిణీ చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో వాలంటరీల వల్ల కార్యకర్తలకు, నేతలకు చాలా నష్టం జరిగిందనే విధంగా సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని వైసిపి పార్టీ కూడా నిజమని చెప్పింది. అందుకే కూటమి సర్కార్ కూడా వాలంటరీ వ్యవస్థను ఏమాత్రం ముట్టుకోలేదనే విధంగా వినిపిస్తున్నాయి. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వాలంటీర్ల వ్యవస్థ జోలికి అసలు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే జరిగిన ఒక మీటింగ్లో కూడా ఈ విషయం గురించి మాట్లాడారట. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కూడా ఇటీవలే పార్టీ శ్రేణులతో పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ వల్లే వైసిపి నాయకులు ప్రజలకు దూరంగా ఉన్నారని.. తాను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలియజేశారు. పార్టీ కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని తెలియజేశామని.. అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థ జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశామని తెలిపారు. 50 కుటుంబాల బాధ్యతను వాలంటరీలకు అప్పగించడంతో సజావుగానే ఉన్నప్పటికీ దీనివల్ల పార్టీకి నేతలకు చాలా దూరం పెరిగిపోయింది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే ఇక వాలంటరీ వ్యవస్థ ఉండదని కనిపిస్తోంది.