- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

తాజా గా ఏపీలో మరో సర్వే రిపోర్ట్ వెలుగు చూసింది. మొత్తం 120 నియోజకవర్గాలు 20 మంది మంత్రులపై చేపట్టిన సర్వే ఫలితాలు బయటికి వచ్చాయి. గతంలో వచ్చిన సర్వేకు ఎప్పటి సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గత సర్వేలు కేవలం రెండు నెలల కిందటే వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ రెండు నెలల వ్యవధిలో చేపట్టిన సర్వేలో కొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా మంత్రుల విషయంపై చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. గత రెండు సర్వేలలో అంతా బాగున్న జాబితాలో 12 మంది మంత్రులు ఉన్నారు. ఆరెంజ్ ( ఓ మాదిరి ) జాబితాలో పదిమంది ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన జాబితాలో అస్సలేమీ బాగోలేదు అని పేర్కొన్న మంత్రులు జాబితా 10 మంది వరకు ఉన్నట్టు సర్వే చెబుతోంది.


వారి పేర్లు వెల్లడించకపోయిన వారిపై ప్రజల్లోనే కాదు పార్టీలోను సొంత నియోజకవర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వే స్పష్టం చేస్తుంది. పార్టీ నాయకులు కూడా ఈ పదిమందిలో నలుగురిని ఇప్పటికిప్పుడే మార్చేయాలని కోరుకుంటున్నట్టు సర్వే చెప్పటం గమనార్హం. వీరిలో తూర్పుగోదావరి , విశాఖ , కర్నూలు , గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారని సర్వే పేర్కొంది. అయితే వీరి పేర్లు మాత్రం బయటకు చెప్పలేదు. వీరి పనితీరుపై చంద్రబాబుకు కూడా అసహనంతో ఉన్న మాట వాస్తవమేందని టిడిపి సీనియర్లు కూడా చెబుతున్నారు. వీరు ఇలాగే కొనసాగితే పార్టీ ప్రభావం ఎలా ఉన్నా ప్రభుత్వపరంగా ఇబ్బందులు తప్పవని ప్రజలలో సింపతి పోయే ప్రమాదం ఉందని పేర్కొనటం గ‌మ‌నార్హం. అయితే చంద్ర‌బాబు ఇప్ప‌టికిప్పుడే వీరిని మారుస్తారా లేదా అన్నది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: