
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో రోజా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని రోజా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన తెలిపారు. ఆమె అరెస్ట్ కు వారెంట్ సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. రోజా రోజులు లెక్క పెట్టుకోవాలంటూ రవి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రవి నాయుడు మాట్లాడుతూ రోజా క్రీడా మంత్రిగా ఒక్క స్టేడియంను అయినా నిర్మించారా అని ప్రశ్నించారు.
రోజా నిత్యం తమిళనాడులోనే ఉంటున్నారని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై రోజా వ్యాఖ్యలుక్షమించరానివని ఆయన పేర్కొన్నారు. రోజాకు ధైర్యం ఉంటే భాను ప్రకాష్ సవాల్ ను స్వీకరించాలని ఆయన చెప్పుకొచ్చారు. రోజా వ్యాఖ్యలు సభ్య సమాజం తలా దించుకునేలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కామెంట్లపై రోజా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రోజాను అరెస్ట్ చేస్తే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందో లేదో చెప్పలేం కానీ సినీ సెలబ్రిటీల నుంచి మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రోజా ప్రస్తుతం అడపాదడపా టీవీ షోలలో కనిపిస్తున్నా ఆమె క్రేజ్ మాత్రం గతంతో పోల్చి చూస్తే ఊహించని స్థాయిలో తగ్గిందని చెప్పవచ్చు. కొన్ని విషయాలలో రోజా మారాల్సిన అవసరం ఉందని ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రోజా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.