
జనాలు లేని పరిస్థితుల్లో సాక్షి మీడియా క్లోజప్ షాట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. గ్రాఫిక్స్ సహాయం తీసుకుని “భారీ జన సమీకరణ”గా చూపించే ప్రయత్నం జరిగినా - నిజం మాత్రం బయటపడి పోయింది. మాకవరం పాలెం వరకూ పది వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు, గుడివాడ అమర్నాథ్ భారీ కాన్వాయ్‌తో వస్తామని చెప్పడంతో టెన్షన్ పడ్డారు. కానీ జగన్ రాగానే ఆ షో పూత పూసిన బోర్డు లా తయారైంది. అడ్డాకూలీలు తప్ప, పెద్దగా పార్టీ కార్యకర్తలు కూడా కనబడలేదు. ఒకప్పుడు “జగన్ వస్తున్నారు” అంటే కిక్కు ఇచ్చే వైసీపీ షోలు… ఇప్పుడు ఇలా బలహీనంగా మారడం పార్టీకి హెచ్చరికే.“భారీ జన సమీకరణ చేస్తాం” అని గొప్పలు చెప్పిన నేతల ఎవరూ మైదానంలో కనిపించలేదు.
ఫలితంగా జగన్ షో పరువు పోయినట్లయింది. ఈ పరిస్థితి వైసీపీ కేడర్‌లో షాక్ క్రియేట్ చేసింది. అదే సమయంలో నర్సీపట్నం వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ మొత్తం టీడీపీలో చేరిపోవడం మరో గట్టి దెబ్బ అయ్యింది. జగన్ రెడ్డి ఎన్ని స్కిట్లు ప్రదర్శించినా, ఈ సారి పోలీసులు కూడా రెడీగా ఉన్నారు. జన సమీకరణలో వైఫల్యం, షోలో బలహీనత పూర్తిగా రికార్డ్ అయ్యింది. విశాఖ మెడికల్ కాలేజీ యాత్రను బలంగా ప్రదర్శించాలని వైసీపీ నేతలు ప్లాన్ చేసినా… చివరికి అది జగన్ కు పెద్ద పరువు పోయే సంఘటనగా మారింది. మొత్తానికి… “జనజాతర” అని ఊహించిన షో… “ఖాళీ రోడ్ షో”గా మారిపోయింది. వైసీపీ నేతల నిర్వాహక లోపం, ప్రజల్లో తగ్గుతున్న హడావిడి— జగన్ కు పెద్ద హెచ్చరికగా మారింది.