ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాలలో లక్షల విలువైన గుడి బంగారం, ఆస్తులు కూడా మాయం కావడం జరుగుతోంది. అలా ఇప్పుడు కేరళలోని ప్రసిద్ధి గల ఆలయం శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో తాజాగా బంగారం మాయం ఆయన సంఘటన ఆలస్యంగా బయటపడి సంచలనంగా మారింది. గుడిని చూసుకొనే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ పైన ఈ బంగారు దొంగతనం, ఆస్తుల దుర్వినియోగం చేసినట్టుగా వినిపిస్తున్నాయి.


గుడిలోని ద్వారపాలకులు, పీటల పైన ఉన్నటువంటి బంగారం పూతను TDB అధికారులు రహస్యంగా తీసేసారంటూ శబరిమల ప్రత్యేక కమిషనర్ కేరళ హైకోర్టుకు ఇచ్చినటువంటి నివేదికలలో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. సెప్టెంబర్ 7వ తేదీన మరమ్మత్తుల కోసం చైనాకి పంపినట్లు ఆయన కోర్టుకు తెలియజేశారు. అయితే 2019లో ఇలాగే మరమ్మత్తులు చేసి తీసుకు వచ్చినప్పుడు బంగారం బరువులో చాలా తేడాలు వచ్చాయని తెలపడంతో కేరళ హైకోర్టు ఈసారి స్వయంగానే విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణలో బయటపడిన విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


1.5 కిలోల బంగారం వాడిన ప్లేటును TDB రికార్డులలో రాగి పలకలని తప్పుగా రాశారని, కానీ 1999లో ఆ క్లాండింగ్ కోసం 1.5 కిలోలు బంగారం ఉపయోగించారనే వాస్తవాన్ని TDB అధికారికంగా దాచి పెట్టింది. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో చాలా ముఖ్యమైన భాగాలకు 1998లో విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవర్సెస్ గ్రూప్ 30.291 కిరాల బంగారాన్ని ఇచ్చారని, దీంతో ద్వార పాలకుల క్లాడింగుకు 1.564 కిలోల బంగారం ఉపయోగించారు. అయితే ఈ గుడికి సంబంధించి అన్ని మరమ్మత్తులను సన్నిధానంలోనే జరగాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ వాటిని కాదని ఉన్నికృష్ణన్ కు అప్పగించి చెన్నైకి పంపించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.


ఉన్నికృష్ణ వాటిని మరమ్మత్తు సంస్థకు పంపించడానికి ఒక నెల ముందు నిధుల సేకరణకు పలు రకాల కార్యక్రమాలను చేపట్టారని ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు జయరామ్ కూడా పాల్గొన్నారు.. కానీ 2019లో మరమ్మత్తు తర్వాత తిరిగి వచ్చిన ఆ వస్తువు 4.5 కిలోల బంగారం బరువు తగ్గిపోయిందని చెప్పిన TDB బోర్డు పట్టించుకోలేదు. మళ్లీ 2023లో బంగారం పూత మరమ్మత్తు బాధ్యతలను ఉన్నికృష్ణన్ కి అప్పగించారు. దీంతో ఆరోపణలు ఎక్కువగా వినిపించడంతో దర్యాప్తు చేయడానికి హైకోర్టు సీట్ అధికారులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా గుడిలో ఆస్తులను లెక్కించడానికి మాజీ న్యాయమూర్తిని కూడా నియమించారు , ప్రస్తుతం వినిపిస్తున్న ఈ స్కామల పైన కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. మరి ఈ దర్యాప్తులో ఇంకా ఎన్ని విషయాలు బయట పడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: