
ఎటువంటి రాజకీయ ప్రకటనలైనా సరే ఊరేగింపులు అయినా సరే ఆయా పార్టీలు ముందుగా పోలీసులు అనుమతులు తీసుకోవాలని దీని ద్వారా ట్రాఫిక్ ,భద్రత ఏర్పాట్లను , లౌడ్ స్పీకర్లు లేదా ఇతర సౌకర్యాలకు అవసరమైన అనుమతులను కూడా పొందాలి అంటూ తెలిపారు. మంత్రులు అధికారిక విధులను ఎన్నికల ప్రచారంతో అసలు కలపకూడదని అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని, రవాణ సిబ్బందిని రాజకీయ పార్టీ ప్రచార ప్రయోజనాలకు ఉపయోగించకూడదంటూ ఈసీ సంచలన నిర్ణయం తెలియజేసింది. అలాగే మైదానాలు, హెలిప్యాడ్ వంటివి బహిరంగ ప్రదేశాలలో అన్ని పార్టీలకు ఒకే నిబంధన పైన సమానంగా అందుబాటులో ఉండేలా చూడాలంటూ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
అటు బీహార్లో 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు సుమారుగా 14000 మంది ఉన్నట్లు ఈసి అధికారులు తెలియజేశారు. ఎస్ఐఆర్ తర్వాత 85 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందే అంటూ వివరించారు. గతంలో 16 లక్షల పైగా ఉండగా ప్రస్తుతం 4 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు డేటాను తెలియజేశారు. ఇక మహిళా ఓటర్ల సంఖ్య 3 కోట్ల 72 లక్షల నుంచి 3 కోట్ల 49 లక్షలకు తగ్గిందని, అలాగే పురుషుల ఓట్లు 3 కోట్ల92 కోట్ల వరకు ఉన్నట్లు ఈసి అధికారులు తెలియజేశారు. ఇతర ఓట్ల సంఖ్య రెండువేల పైగా ఉన్నదని తెలియజేశారు. బీహార్ ఎన్నికలు రెండు దశలలో జరగబోతున్నట్లు ప్రకటించింది ఈసి. అప్పటినుంచి ఈ నిబంధనలన్నీ కూడా వర్తిస్తాయంటు తెలియజేస్తున్నారు.