తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ఈమేజ్ కలిగిన నటులలో బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నారు. ఎంతో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. ఇకపోతే బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఓ రెండు మూవీలలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించి రెండు సినిమాలతో కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇంతకు బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఏ సినిమాలలో పవన్ నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం వకీల్ సాబ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... వేణు శ్రీరామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొదట పవన్ కళ్యాణ్ ను కాకుండా బాలకృష్ణ ను హీరో గా తీసుకోవాలి అని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ మూవీ ని రిజెక్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం భీమ్లా నాయక్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుపాటి రానా కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొదట పవన్ కళ్యాణ్ పాత్రకు బాలకృష్ణ ను తీసుకోవాలి అని మేకర్స్ అనుకున్నారట. కానీ బాలకృష్ణ ఆ పాత్రను రిజెక్ట్ చేశాడట. దానితో పవన్ కళ్యాణ్ ను మేకర్స్ ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారట. ఇలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన రెండు సినిమాలతో పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన విజయాలు దక్కినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: