
జయచంద్రారెడ్డి ఔట్ – కొత్త ఆట మొదలు:
జయచంద్రారెడ్డి నియామకం అవగానే వివాదాలు చుట్టుముట్టాయి. గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వడాన్ని చాలా మంది సొంత టీడీపీ నేతలే వ్యతిరేకించారు. చివరకు నకిలీ మద్యం కేసు పార్టీకి చేదు ఇమేజ్ తెచ్చిపెట్టడంతో హైకమాండ్ కఠినంగా వ్యవహరించింది. ఇప్పుడు తంబళ్లపల్లెలో కొత్త నాయకుడి అవసరం పార్టీకి అత్యవసరంగా మారింది.
లోకేశ్ స్ట్రాటజీ – పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కౌంటర్ :
తంబళ్లపల్లెలో కొత్త ఇన్ ఛార్జి విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేరుగా జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఎదురొడ్డి నిలిచే బలమైన నేతను తీసుకురావాలనే వ్యూహం ఆయనది. ఈ నేపథ్యంలో తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పేరు హాట్ టాపిక్ గా మారింది.
చినబాబు ఫ్యాక్టర్ – బీసీ కార్డ్ ప్లే :
శ్రీరామ్ చినబాబు బీసీ కమ్యూనిటీకి చెందిన నేత. యువ నాయకుడు. మదనపల్లెలో పార్టీ కోసం ఆయన కష్టపడిన తీరు హైకమాండ్ కు సానుకూలంగా ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన మదనపల్లె టిక్కెట్ ఆశించారు కానీ పార్టీ మైనారిటీ కోటాలో భాషాకు టిక్కెట్ ఇవ్వడంతో అవకాశం దక్కలేదు. అయినా పార్టీ గెలుపుకోసం పని చేశారు. ఆయన నిబద్ధతను గుర్తించి లోకేశ్ చినబాబు పేరును ముందుకు తెచ్చారని సమాచారం.
శంకర్ యాదవ్ vs చినబాబు :
మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేరు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉంది. అయితే కడపగా చూస్తే యువకుడు, ప్రజల్లో పాపులారిటీ ఉన్న చినబాబు పై ఎక్కువగా హైకమాండ్ మొగ్గు చూపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయాలంటే యువశక్తి అవసరం అని లోకేశ్ అభిప్రాయం.
చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ :
ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని చెబుతున్నారు. రేపో, మాపో తంబళ్లపల్లె కొత్త ఇన్ ఛార్జిగా శ్రీరామ్ చినబాబు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం బలంగా ఉంది. మొత్తానికి తంబళ్లపల్లెలో జయచంద్రారెడ్డి అవుట్… చినబాబు ఇన్ అనేది ఇప్పుడు టీడీపీలో ఫిక్స్ అయిపోయిన టాక్. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఎదురు బలంగా నిలవాలనే లోకేశ్ వ్యూహం అక్కడి నుంచి టీడీపీ రాజకీయాలను రీషేప్ చేసే ఛాన్స్ ఉంది.