తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికే  ఆరు గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం  పడుతూ లేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే పూర్తిగా ఆరు గ్యారెంటీ లు కూడా అమలు చేయలేదు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తమవుతోంది. ఇదే సమయంలో పాలకులైనా కరెక్ట్ గా ఉన్నారా అంటే వారి మధ్య వారికే అసలు పొసగడం లేదు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను నిందించడంతో అది కాస్త వార్తల్లో నిలిచింది. చివరికి అధిష్టానం స్పందించి వారి మధ్య సందీ కుదిర్చింది. 

ఇది మరువక ముందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య వైరం వచ్చినట్టు తెలుస్తోంది. వరంగల్ ఇన్చార్జ్ మంత్రి గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే నియమితులయ్యారో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అస్సలు పొసగడం లేదట. ఎప్పుడు ఏదో ఒక వివాదం తో బయటకు వస్తూనే ఉన్నారు. అలాంటి ఈ తరుణం లో తాజాగా  మేడారం జాతరకు సంబంధించి 71 కోట్ల టెండర్ విషయంలో కూడా పొంగులేటి అనుచరులకే  ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ శాఖకు మంత్రి గా ఉన్న తనతో సంబంధం లేకుండా అన్నితానై నడిపిస్తున్నారని ఆరోపించారు కొండా సురేఖ.

అసలు దేవాదాయ శాఖ లో పొంగులేటి జోక్యం ఏంటని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఇప్పటికే పొంగులేటి వైఖరిపై  మంత్రి కొండా సురేఖ దంపతులు అధిష్టానానికి ఫిర్యాదు  కూడా చేశారట. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల విషయం లో దెబ్బ పడి సతమతం అవుతుంటే ఇలా మంత్రుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడం మరింత ఇబ్బంది కలిగిస్తోంది. వీరి మధ్య అధిష్టానం ఎలాంటి సందీ కుదుర్చుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: