
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఒకవైపు ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఉంటుంది.. 2024 ఎలక్షన్స్ లో వీరంతా జట్టు కట్టి జగన్ ను దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. చివరికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ జనం జగన్ ను మరిచారని, అందుకే ఆయనకు ఆ సీట్లు వచ్చాయని తెలియజేశారు.. నిజంగానే జగన్ ను జనం మరిచిపోయారా.. జగన్ ను మర్చిపోతే ఆయన బయట అడుగుపెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు అనే వివరాలు చూద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి.. ఇందులో 11 జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిస్తే మిగతావన్నీ టిడిపి,బిజెపి, జనసేన పార్టీ లు గెలిచాయి. ఇందులో చాలా సీట్లు కొద్దిపాటి మెజారిటీతోనే గెలిచాయని చెప్పవచ్చు. ఒకవేళ జనసేన బిజెపి ఎవరికి వారే పోటీ చేస్తే అక్కడ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేవారు.