మరి కొద్ది రోజుల్లోనే బీహార్ రాష్ట్రం లో ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఎన్నికల కమిషన్ ఇప్పటికే బీహార్ లో ఏ తేదీన ఎన్నికలు జరగనున్నాయి ..? ఎన్ని విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి ..? ఏ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది ..? అనే దానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ ప్రధాన పార్టీలు త్వర త్వరగా ప్రచారాలను మొదలు పెట్టి హంగామా నిర్వహిస్తాయి అని చాలా మంది జనాలు అనుకున్నారు.

కానీ ఇక్కడే పెద్ద సమస్య మొదలయ్యింది. ప్రధాన పార్టీలు మొదట ప్రచారాలు చేయడం కంటే కూడా టికెట్లను ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కసరత్తును నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఏ ప్రాంతంలో ఎవరికి టికెట్ కన్ఫామ్ చేశారు అనేది తెలిస్తే ఆ ప్రాంతంలో పోటీ చేసే వ్యక్తి ఆ ప్రాంతంలో ప్రచారాలను నిర్వహిస్తాడు. దానితో ప్రస్తుతం అక్కడ ప్రధాన పార్టీలలో ఒకటి అయినటువంటి బీ జే పీ టికెట్ల పంపిణీ విషయంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్ రాష్ట్రంలో బీ జే పీ సొంతగా కాకుండా పలు పార్టీలతో పాటు పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అక్కడ ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకం. అక్కడ బీజేపీ మరియు జే డీ యూ రెండు పార్టీలు కూడా సమాన స్థానాలలో పోటీ చేయాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుత లెక్కల ప్రకారం బిజెపి 100 , స్థానాల్లో జే డీ యూ 101 స్థానాల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరక్ పాశ్వాన్ పార్టీ కూడా ఈ కూటమిలో భాగంగా పోటీలోకి దిగాబోతోంది. ఈ పార్టీకి 25 సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కూటమిలో మరో మూడు పార్టీలు ఉన్నాయి. దానితో ఆ మూడు పార్టీలకు కలిపి 18 సీట్లు ఇవ్వాలి అనే ఆలోచనలో బీ జే పీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సీట్ల పంపిణీ కార్యక్రమం ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: