
ఈ పరిస్థితి ఆయనను మానసికంగా బాధపెడుతోందట. పార్టీ నాయకత్వం కూడా స్పందించకపోవడం తనకు మరింత నిరాశ కలిగిస్తోందని చెబుతున్నారు. కేంద్ర బీజేపీ మంత్రులకు కూడా తన సమస్య వివరించినా, ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఫలితంగా, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా... ప్రభుత్వ అధికారిక ఈవెంట్లకు మాత్రం దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. మరోవైపు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా తనపై గతంలో వైసీపీ హయాంలో నమోదైన కేసు, ఆ తరువాత జరిగిన విచారణా ప్రక్రియలలో ఎదుర్కొన్న టార్చర్ వంటి పరిణామాలపై ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అప్పట్లో సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
కానీ ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ బీహార్‌లో పనిచేస్తుండగా, అక్కడ న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘురామరాజు పేర్కొన్నారు. రాష్ట్ర పరిధి నుంచి సునీల్‌ను బదిలీ చేయడం పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదేమైనా, ఇద్దరు రాజు నాయకులు తమ వ్యక్తిగత సమస్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు అధికార పార్టీకి చెందినవారే అయినా.. తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించడం లేదన్న భావన బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభుత్వం ఈ ఇద్దరు నాయకుల ఆవేదనపై ఎప్పుడు స్పందిస్తుంది అనేది చూడాలి.