సత్యనారాయణ భౌతికాయాన్ని సందర్శిస్తూ పలువురు నేతలు, రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతి నిధుల సైతం నివాళులు అర్పించడానికి హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు. ఈ విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి సైతం ధైర్యం చేకూరాలంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. సత్యనారాయణ రావు ప్రభుత్వ ఉద్యోగిగా కూడా పనిచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా హరీష్ రావు యాక్టివ్ గా ఉంటూ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. హరీష్ రావు విషయానికి వస్తే.. 32 సంవత్సరాలకే సిద్దిపేట నుంచి అసెంబ్లీలోకి ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నో అంశాల పైన అసెంబ్లీలో తన గొంతును వినిపించారు. అలా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలో కూడా చాలా కీలకమైన సభ్యుడుగా పేరు సంపాదించారు.
హరీష్ రావు 2004 నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.2014 నుంచి 2018 మధ్యలో తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అందుకోవడంతో 2019 సెప్టెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు తెలంగాణ వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి