దేశీయ ఆటో రంగంలో టాటా బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోటార్ ఫీల్డ్ లో ప్రయాణికుల భద్రత విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఇన్ని రోజులు పెద్ద పెద్ద వాహనాలు ,కార్లు, విమాన సంస్థలు, విద్యుత్ వినియోగం, ఫైనాన్స్, సిమెంట్, టీ ఇతర వాటిలో బ్రాండ్ గా నిలిచింది టాటా. ఆరు ఖండాలలో 100కు పైగా దేశాలలో బ్రాండ్ గా పేరు సంపాదించింది. అయితే ఇప్పుడు ద్విచక్ర వాహనాల తయారీలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణ బైకులతో పాటు ఎలక్ట్రానిక్ టు వీలర్ మార్కెట్లోకి పరిచయం చేయబోతున్నట్లు టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందుకు సంబంధించి నిన్నటి రోజున సోషల్ మీడియాలో కూడా కొన్ని న్యూస్ వైరల్ గా మారాయి.



ఇప్పటికే భారీ, మధ్యతరగతి తేలికపాటి వాహనాల కార్ల తయారీలో దూసుకుపోతున్న టాటా మోటార్స్ ఇప్పుడు టూ వీలర్ సెగ్మెంట్లో ప్రవేశించబోతోంది. ఇందులో భాగంగా మొదట 110CC, 125CC బైక్లను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో 110 CC బైక్ ధర రూ. 45,999 రూపాయలలో ఉంటుందట. 125CC  రూ. 55,999 రూపాయలుగా ఉండవచ్చు అనే అంచనా నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఇవి లీటర్ కి 90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయని అలాగే ఎలక్ట్రానిక్ బైక్స్ విషయానికి వస్తే సింగిల్ ఛార్జింగ్ చేస్తే 280 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చట. అయితే దీని ధర రూ .85000 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటు ధరలకే ఉండేలా కనిపిస్తున్నాయి.

 
ఇప్పటికే హీరో ,హోండా, బజాజ్ ,టీవీఎస్ బండి  బైకులకు పోటీ ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది విదేశీ మార్కెట్లోకి టాటా టూ వీలర్స్ ,EV  బైక్స్ ని తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. మరి టాటా అతి తక్కువ ధరకే తీసుకు వచ్చే ఈ టూ వీలర్ బైక్ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: