
కానీ వీరిలో ఒక ఆటగాడు మాత్రం టీ 20 లలోనూ సెంచరీలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ 13 వ తేదీ నుండి జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో స్టీవెన్ స్మిత్ సిడ్నీ సిక్సర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇతను కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు వరుస సెంచరీలు సాధించి రికార్డును సృష్టించాడు. జనవరి 17 వ తేదీన అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ నిర్ణీత ఓవర్ లలో వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది.
ఇందులో ఒక్క స్టీవెన్ స్మిత్ ఒక్కడే 56 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు మరియు 7 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్ 59 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఈ రోజు సిడ్నీ థండర్స్ తో ఆడిన మ్యాచ్ లోనూ స్టీవెన్ స్మిత్ 66 బంతుల్లో 125 పరుగులు చేసి అజేయ సెంచరీని సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా ఈ టోర్నీలో ఎందరో యువఆటగాళ్లు ఉన్నా సీనియర్ ఆటగాడు స్మిత్ మాత్రం వరుస సెంచరీలు చేసి టీ 20 లలో తానూ సత్తా చాటగలనని నిరూపించాడు.