ఉప్పు లేని చెప్పండి ఇప్పుడు రుచికరం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిలో సరిపడినంత ఉప్పు ఉంటేనే ఆ పదార్ధానికి రుచి పెరుగుతుంది. అయితే రుచికి మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక అంశాల కోసం కూడా ఉప్పును ఉపయోగిస్తారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఉప్పుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉప్పుతో కొన్ని చిట్కాలు పాటిస్తే అదృష్టం సొంతం అవుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఆ నమ్మకం కొద్దీ పలు చిట్కాలను కూడా పాటిస్తారు. ఉప్పు వల్ల జీవితం మారుతుందని, ఆరోగ్యం కూడా బాగుంటుందని, సమస్యలు మాయం అవుతాయని నమ్ముతారు. ఆ నమ్మకాల ప్రకారం ఉప్పుతో కొన్ని వాస్తు చిట్కాలు...

ఆర్థిక శ్రేయస్సు కోసం
ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న వారు ఆదాయం పెంచుకోవడానికి ఉప్పుతో ఒక చిట్కా పాటించవచ్చు. ఒక గ్లాస్ లో కొద్దిగా సముద్రపు ఉప్పును ఉంచి, రెండు నుంచి నాలుగు లవంగాలను వేయాలి. దాని ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచాలి. చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుందని జ్యోతిష్య అనుభవజ్ఞులు చెబుతారు. ఈ చిట్కాతో వివిధ వనరుల నుండి డబ్బు రావడం ప్రారంభం అవుతుందట. ఆ ఉప్పు గిన్నెలో చెమ్మ వచ్చిన వెంటనే దాన్ని మారుస్తూ ఉండాలి.
 
అనారోగ్య సమస్యలు
ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే, ఆ సమస్యకు మెడిసిన్ పని చేయకపోతే ఈ పని చేయాలి అంటారు. అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తి తల దగ్గర గాజు గిన్నెలో రాతి ఉప్పు ఉంచాలి.
 
మానసిక ఒత్తిడి, అలసటను తొలగించుకోవడానికి గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి స్నానం చేస్తే సరిపోతుందట.

ఇక ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగించడానికి ఎవరికి తెలియకుండా ఇంటిని ఉప్పు నీటితో తుడవాలి.

చిన్నపిల్లలకు దిష్టి తగిలిందా? ఉప్పుతో ఏడు సార్లు వాళ్ల తలపై నుంచి తిప్పి పారేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: