
ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది ఉంటుంది . పూజ గదిలో కచ్చితంగా వినాయకుడి పటం ఉంటుంది . అయితే వినాయకుడి పటం వద్ద ఒక పసుపు గుడ్డలో ఒక రూపాయి లేదా ఐదు రూపాయలు బిల్ల.. అందులో కొన్ని అక్షింతలు కలిపి పసుపు గుడ్డను ముడుపులా చుట్టి ఆ ముడుపు వినాయక స్వామికి బొడ్డుకు దారంలా కడితే ఇంట్లో సిరిసంపదలు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయట . ఆ ఇళ్ళు ఎప్పూడు సుఖ సంతోషాలతో ఉంటుందట. అంతేకాదు ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడూ ఆ ఇంటిపై చల్లగా ఉంటాయట.
పిల్లల చదువులు.. పిల్లల ఆరోగ్యాలు .. ఎప్పుడు చక్కగా ఉంటాయట. అంతేకాదు ఇలా శాలరీ వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోతుంటే ఇంట్లో కొంచెం డబ్బు నిలవనిచ్చే విధంగా ఆ వినాయకుడే చేస్తాడట . మన ఇంట్లోని చాలామంది పెద్దవాళ్ళు ఇలా చెబుతూనే ఉంటారు . ఇప్పటికి చాలామంది ఇలాంటి పద్ధతిని ఫాలో అవుతూనే ఉంటారు . కానీ కొంతమంది మాత్రమే ఇదంతా మూఢనమ్మకమని కొట్టి పడేస్తూ ఉంటారు . కానీ చాలామంది మాత్రం ఇలా చేసిన తర్వాత సక్సెస్ అయ్యారు . మరెందుకు ఆలస్యం మీరు ఈ ప్రాబ్లం తో బాధపడుతూ ఉంటే చేతుల్లో డబ్బులు నిలవకపోతే ఒక్కసారి ఇలా చేసి చూడండి .. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు..ఆ వినాయుకుడి ఆశీసులు మీ ఇంటి పై ఎప్పటికి ఉన్నటే..!