సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీల పై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడం కామన్ గా మారిపోయింది. ఇక ఇలాంటి వార్తలు ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉన్నాయి నేటి రోజుల్లో. ఇక ఇలాంటి వార్తలలో కొన్ని నిజాలు ఉంటే కొన్ని మాత్రం కేవలం పుకార్లు గానే మిగిలిపోతున్నాయ్. ఇక ఇలాంటి ఒక పుకారు పైన బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఇటీవల స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. మొన్నటి వరకు టీమిండియా కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీపై ఆగ్రహంతో సౌరబ్ గంగూలీ  షోకాజ్ నోటీసులు జారీ చేయబోతున్నాడని చర్యలకు సిద్ధం అయ్యాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు ఇక వైరల్ గా మారిపోయాయి. దీంతో సౌరవ్ గంగూలీ  ఇలా చేయబోతున్నాడా అంటూ అందరూ షాక్ అయ్యారు. అయితే ఇక ఈ వార్త అందరూ బలంగా నమ్మడానికి కారణాలు కూడా లేకపోలేదు. గతంలో విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన సమయంలో మేము ముందుగానే సమాచారం అందించామని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకో వద్దు అని కూడా ఎంతగానో విజ్ఞప్తి చేశాము అంటూ తెలిపారు. ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తను తప్పుకో వద్దు అని  ఎవరూ చెప్పలేదని.. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు మాత్రమే సమాచారమిచ్చారు అంటూ బాంబు పేల్చేశాడు. దీంతో ఇది కాస్త ఒక రకంగా చిన్నపాటి వివాదం గానే మారిపోయింది.


 ఇక అప్పటి నుంచి విరాట్ కోహ్లీ సౌరవ్ గంగూలీ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తుంది అని ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ప్రెస్మీట్లో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన సౌరవ్ గంగూలీ చర్యలకు సిద్ధమయ్యాడని విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఇది నిజమే అనుకొని నమ్మారు అందరు. కాని సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తాను భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం .. అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి: