ఇటీవల కాలం లో అటు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఎన్నో ఏళ్ళ పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఆ తర్వాత కాలం లో మాత్రం అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలా జట్టుకు దూరమైన సమయం లో నిరాశలో  మునిగి పోతున్న పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఇక తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెబుతూ ఉన్నారు. అంతే కాదు పాకిస్తాన్ క్రికెట్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్న విషయాలను కూడా చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమం లోనే గత కొంత కాలం నుంచి పాకిస్థాన్ జట్టుకు దూరమైన అహ్మద్ షేజాద్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 పాకిస్థాన్ జట్టులో ఎవరైనా ఆటగాడు విజయ వంతమైతే సీనియర్లు చూసి తట్టుకోలేరని అసూయ పడతారు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. అదే సమయం లో భారత జట్టు గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అద్భుతంగా రాణించడానికి కారణం మహేంద్ర సింగ్ ధోనీ.  ధోని అండగా ఉంటూ మద్దతు ఇవ్వడం వల్లే విరాట్ కోహ్లీ ఎంతో స్వేచ్చగా ఆడుతూ విజయ వంతమయ్యాడు. దురదృష్టం   కొద్దీ పాకిస్తాన్లో అలాంటి పరిస్థితి లేదు అంటూ అహ్మద్ షేజాబ్ వ్యాఖ్యానించాడు. ఇక పాకిస్తాన్ జట్టు లో ఎవరైనా అద్భుతం గా ఆడితే సీనియర్లు అస్సలు తట్టుకోలేరు..


 ఆటలో విజయవంతమై ఎదుగుతూ ఉంటే చూసి అస్సలు సహించలేరు. విరాట్ కోహ్లీ రెండేళ్లుగా ఫామ్ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. అయినప్పటికీ టీంలో ఉన్నాడు. కానీ నా విషయంలో రెండు మ్యాచ్లు ఆడక పోయేసరికి పక్కన పెట్టేశారు. ఈ క్రమంలోనే ఫామ్ సాధించడానికి దేశవాళి క్రికెట్ ఆడమన్నారు. ఇక వాళ్ళు చెప్పినట్లుగానే దేశవాళీ క్రికెట్లో ఆడి భారీగా పరుగులు చేసిన మళ్లీ జట్టులో స్థానం కల్పించలేదు అంటూ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అమ్మద్ షాదాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: