గతంలో ఎన్నో ఏళ్ల పాటు తమ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి చివరికి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్కు దూరంగా ఉంటున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు మైదానంలోకి మరోసారి దిగి తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న వారు మరోసారి మైదానంలోకి దిగి ప్రత్యర్థులుగా మారిపోయి నువ్వ నేనా అన్నట్లుగా పోట్లాడుతూ ఉండడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.


 ఇకపోతే రోడ్ సేఫ్టీ వరల్డ్ లో భాగంగా ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇండియా లెజెండ్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన  ఇర్ఫాన్ పఠాన్ కీలకమైన మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.

 
 ఒకవైపు ఓపెనర్ నమన్ ఓజా 98 పరుగులు చేసి అజయంగా నిలిస్తే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఇర్ఫాన్ పఠాన్  12 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. దీంతో మరో నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేదించింది ఇండియా లెజెండ్స్ జట్టు. కాగా మ్యాచ్ అనంతరం ఇర్ఫాన్ పఠాన్ కుమార్ ఇమ్రాన్ తో సరదాగా ముచ్చటించిన సచిన్ టెండూల్కర్.. ఈరోజు మీ నాన్న వల్లే మ్యాచ్ గెలిచాం అంటూ బుడ్డోడిని ముద్దు చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. టప్ టప్ అంటూ సిక్సర్లు కొట్టాడు అంటూ బుడ్డోడితో అన్నాడు సచిన్. ఇకపోతే ఇటీవల ఫైనల్ లో అడుగు పెట్టిన టీమ్ ఇండియా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో విజయం సాధించాలని భావిస్తూ ఉంది. కాగా జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉండడం టీమిండియా కు కలిసి వచ్చే అంశం అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: