సాధారణంగా జాతీయ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించాలి అన్నది ప్రతి క్రికెటర్ కి  ఎలా అయితే కోరిక ఉంటుందో.. ఇక జాతీయ జట్టు తరఫున అటు వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవాలని బాగా రాణించాలని మరింత ఎక్కువగా ఆటగాళ్లు కోరుకుంటారు అని చెప్పాలి. ఇలా అదృష్టం కొద్దీ ఒకవేళ వరల్డ్ కప్ జట్టులో అవకాశం దక్కింది అంటే ఇక అంతకంటే ఇక జీవితానికి ఇంకేం కావాలి అంటూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న కారణాలతో చివరికి జట్టు నుంచి వైదొలగడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. స్టార్ బ్యాట్స్మెన్ హిట్ మేయర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది అని చెప్పాలి..


 ప్రస్తుతం వెస్టిండీస్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు  హిట్మేయర్. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో అతడు బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవలే ఊహించని రీతిలో అతనిపై వేటు పడింది. వెస్టిండీస్ టి20 వరల్డ్ కప్ జట్టు నుంచి అతని తొలగిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇటీవలే ఆస్ట్రేలియాకు పయనం అవ్వాల్సి ఉండగా అతను మాత్రం విమానాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఆగ్రహించిన సెలెక్టర్లు అతని పక్కన పెట్టేసారు. అతని స్థానంలో బ్రూక్స్ ని తుది జట్టులోకి ఎంపిక చేశారు. నిజానికి శనివారమే హెట్ మేయర్ ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది.


 కుటుంబ కారణాల వల్ల అతను ఆస్ట్రేలియా బయలుదేరేందుకు సోమవారం వరకు అనుమతి ఇచ్చారు సెలక్టర్లు. ఇక గోల్డ్ కోస్టులో బుధవారం ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రాక్టీస్ మ్యాచ్ అతను అందుబాటులో ఉండాలని అనుకున్నారు. కానీ రీ షెడ్యూల్ చేసిన విమానాన్ని కూడా హెట్ మేయర్ అందుకోలేకపోతున్నట్లు తెలిసింది. ప్రయాణంలో ఆలస్యం ఇబ్బందులు ఉంటే అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం మినహా మరింకో మార్గం లేదు అంటూ సెలెక్టర్లు తెలిపారు.  ఈ క్రమంలోనే అతని జట్టు నుంచి తొలగిస్తున్నట్లు ఇక వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: