మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ గా  రోహిత్ శర్మ మిస్టర్ కూల్ కెప్టెన్గా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంతోప్రశాంతంగా ఉంటూ.. ఇక తన వ్యూహాలతో మ్యాచ్ పరిస్థితులు అన్నింటిని కూడా తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మ ఏకంగా తన జట్టు ఆటగాళ్ల విషయంలో సీరియస్ అవ్వడం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎవరైనా ఆటగాడు తప్పు చేస్తే ఏకంగా అతనితో సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు.



 సాధారణంగా ఆటలో ఇవన్నీ కామన్ అన్న విషయం తెలిసిందే. ఏకంగా భావోద్వేగాలు లేకుండా ఆటను కొనసాగించడం అంటే చాలా కష్టం. అయితే కొన్ని కొన్ని సార్లు రోహిత్ శర్మ ఏకంగా తన జట్టు ఆటగాళ్లు తప్పు చేసినప్పుడు తిడుతున్నట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఎవరైనా ఆటగాడిని తిట్టినప్పుడు  వాళ్ళు ఏదైనా ఫీలయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయంపై ఇటీవల కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుల్దీప్ యాదవ్ రోహిత్ శర్మ అప్పుడప్పుడు తమను తిడుతూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.


 అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తమను తిట్టినా పెద్దగా పట్టించుకోము అంటూ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫీల్డింగ్ మిస్ అయినప్పుడు రోహిత్ అనే మాటలకు మేమేమి బాధపడం. మైదానంలో దిగినప్పుడు పరిస్థితి అలాగే ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వచ్చాక తిరిగి తను మా మీద చాలా ప్రేమ చూపిస్తాడు. తనతో మా అందరికీ మంచి అనుబంధం కూడా ఉంది అంటూ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో నాకు బౌలింగ్ గురించి ఏం చెప్పడు. కానీ బ్యాటింగ్లో మాత్రం కాస్త మెరుగవ్వు అంటూ ఎప్పుడూ రోహిత్ శర్మ సూచిస్తూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు కుల్దీప్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: