ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ విజేతగా నిలబడమే. అయితే 17 ఏళ్ల ఐపీఎల్ కెరియర్ లో ఒక్కసారి కూడా బెంగళూరు టీం టైటిల్ గెలవలేకపోయింది. మహా మహా స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ ఆ జట్టు టైటిల్ వేటలో మాత్రం మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే వెనుకబడిపోయింది అని చెప్పాలి.


 విరాట్ కోహ్లీ సారథ్యంలో ఎన్నోసార్లు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. అభిమానులకు ప్రతిసారి నిరాశ మిగులుస్త వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఫ్యాబ్ డూప్లెసెస్ కెప్టెన్సీలో పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ టైటిల్ మాత్రం గెలవలేక పోతుంది బెంగళూరు టీం. దీంతో టైటిల్ గెలవాలి అనేది అటు బెంగుళూరు జట్టు అభిమానులకు ఒక చిరకాల అన్నట్లుగా మారిపోయింది. ఈ కలను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రెండవ సీజన్లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉమెన్స్ టీం నిజం చేసి అందరిలో ఆనందాన్ని నింపింది. అయితే ఇక ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన శ్రేయంక పాటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


 మొన్నటి వరకు ఉమెన్స్ క్రికెట్లో స్మృతి మందాన అందరికీ క్రష్ గా ఉండేది. కానీ ఇక ఆర్సిబి కప్పు గెలిచిన తర్వాత శ్రేయాంక పాటిల్ ఇక యూత్ అందరికీ కూడా కొత్త క్రష్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె గురించి చర్చ జరుగుతుంది. ఫైనల్ లో నాలుగు వికెట్లు తీసి.. సీజన్ మొత్తంలో కూడా 13 వికెట్లు తీసి పర్పులు క్యాప్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా అందుకుంది అని చెప్పాలి. ప్రస్తుతం బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న 21ఏళ్ళ శ్రేయంక  పాటిల్ బెంగళూరుకు చెందిన అమ్మాయి కావడం గమనార్హం. గత ఏడాది టీమిండియాలోకి వచ్చిన ఈ యంగ్ ప్లేయర్ మునుమందు మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl