సాధారణంగా క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని వింతైన సెంటిమెంట్లు తెరమీదకి వస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఏకంగా ఆటగాళ్ల ప్రదర్శన పక్కన పెట్టి ఇక ఆయా సెంటిమెంట్లు నిజమవుతాయని ప్రేక్షకులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఆటగాళ్లు ఎలా ప్రదర్శన చేసిన ఆ సెంటిమెంట్ కలిసి వచ్చింది అంటే.. చాలు తాము అనుకున్న జట్టు తప్పకుండా విజయం సాధిస్తుంది అని బలంగా నమ్ముతూ ఉంటారు. అదేంటో గాని ఇక ఇలాంటి సెంటిమెంట్లు కొన్ని కొన్ని సార్లు నిజం అవుతూ ఉంటాయి. ఇక ఇలాంటిది ఏదైనా జరిగిందంటే చాలు అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇకపోతే గత కొంతకాలం నుంచి ఎంతో ఉత్కంఠ సాగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. స్మృతి మందాన కెప్టెన్సీ లో ఏకంగా ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించిన బెంగళూరు టీం.. మొదటిసారి టైటిల్ను గెలుచుకొని అభిమానుల కోరిక తీర్చింది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక వింతైన సెంటిమెంట్ తెరమీదకి వచ్చింది. మరోసారి గెలుపు లెఫ్ట్ దే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.


 ఎందుకంటే టోర్నీ ఏదైనా ట్రోఫీకి ఎడమవైపు నిలబడిన జట్టు కెప్టెన్ కే విజయం వరిస్తుందని.. ఇక ఆ టీం టైటిల్ గెలుస్తుందని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి జట్టు మరోసారి నిరూపించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకంటే ఫైనల్స్ కు ముందు ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్లు ఫోటో దిగుతూ ఉంటారు. అయితే ఈ ట్రోఫీకి కుడి వైపు ఢిల్లీ కెప్టెన్, ఎడమవైపు ఆర్సిబి జట్టు కెప్టెన్ స్మృతి మందాన నిలబడ్డారు. దీంతో ఆర్సిబి గెలిచింది. అయితే గతంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై కెప్టెన్ హార్మన్ ప్రీత్ ఇలాగే ఎడమవైపు నిలబడింది. టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఆస్ట్రేలియా, గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కెప్టెన్లు కూడా ఇలా లెఫ్ట్ సైడ్ నిలబడి టైటిల్ గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl