నరైన్ మొదటగా బౌలర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన తన అద్భుతమైన బంతులతో బ్యాటర్ లకి చుక్కలు చూపించడం మాత్రమే కాకుండా... ఇతను వేసిన అద్భుతమైన బంతులతో ఎన్నో వికెట్ లను సాధించి తన జట్టుకు ఎన్నో విజయాలను కూడా అందించాడు. ఈయన చాలా సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్" లో మ్యాచ్ లను ఆడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో కూడా మొదట ఈయన బౌలర్ గానే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

చాలా మంది కేవలం ఈయనలో ఉన్న బౌలింగ్ ప్రతిభను తప్ప బ్యాటింగ్ ప్రతిభను గుర్తించలేదు. అలాంటి సమయం లోనే ఇతను కోల్కతా నైట్ రైడర్స్ (కే కే ఆర్) టీం లో ఆడుతున్న సమయంలో అప్పుడు ఇదే టీం కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ ఇతనిలో ఉన్న బ్యాటర్ ను కూడా గుర్తించాడు. దానితో ఈయనను ఓపెనర్ గా పంపడం మొదలు పెట్టాడు. ఈయన కూడా మొదటి నుండి అటాకింగ్ మూడ్ లో ఉంటూ వీలైనంత తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోరు చేయడంతో ఇతను చాలా రోజులు ఓపెనర్ గానే బ్యాటింగ్ చేశాడు.

ఆ తర్వాత గంభీర్ ఈ టీం ను వదలడంతో ఈయన కూడా టాప్ ఆర్డర్ నుండి లోయర్ ఆర్డర్ కు వెళ్లిపోయాడు. ఇక తాజాగా గంభీర్ ఈ టీం లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈయన మళ్ళీ ఓపెనర్ గా వస్తున్నాడు. ఇక నిన్న కోల్కతా కి ఢిల్లీ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో నరైన్ ఓపెనర్ గా వచ్చాడు. ఇక నిన్నటి ఇన్నింగ్స్ లో ఈయన ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లోనే 85 రన్స్ చేశాడు. ఒక దశలో నరైన్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇతను అవుట్ అయ్యాడు. ఇక నరైన్ ఇంత గొప్ప పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఈయనలో ఉన్న బ్యాటింగ్ స్కిల్స్ గ్రహించిన గౌతమ్ గంభీర్ అని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: