
కోహ్లీ నెం.18 జెర్సీ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఓ సెంటిమెంట్. అతని రికార్డుల మోత మోగించిన కెరీర్, 9,230 టెస్ట్ పరుగులు, 30 సెంచరీలు, కెప్టెన్‌గా 40 విజయాలు, అన్నిటికీ ఆ జెర్సీయే ప్రతీక. మామూలుగా నెం.49 జెర్సీ వేసుకునే ముఖేష్, ఈ అనధికారిక టెస్టులో కోహ్లీ నెంబర్‌తో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడంతో, ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. కొందరు ఏకంగా బీసీసీఐని ట్యాగ్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ గందరగోళంపై ఓ సీనియర్ బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు. ఇండియా A మ్యాచ్‌లలో జెర్సీ నంబర్లు ఫిక్స్‌డ్‌గా ఉండవట. ఆటగాళ్లు అప్పటికప్పుడు ఏదో ఒక నంబర్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. అదే అంతర్జాతీయ మ్యాచ్‌లలో అయితే, నంబర్లు పర్మనెంట్‌గా ఉంటాయన్నారు. ముఖేష్ నెం.18 జెర్సీ వేసుకోవడం కేవలం ఈ మ్యాచ్ వరకేనని, ఒకవేళ అతను భారత జట్టుకు ఆడితే, తన రెగ్యులర్ నెం.49 జెర్సీనే ధరిస్తాడని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి బీసీసీఐ అధికారికంగా నెం.18 జెర్సీని రిటైర్ చేయలేదు. కానీ, ఆ నంబర్‌కున్న లెగసీ దృష్ట్యా, భవిష్యత్తులో ఏ కొత్త టెస్ట్ ప్లేయర్ కూడా దాన్ని తీసుకునే సాహసం చేయకపోవచ్చని క్రికెట్ పండితులు అంటున్నారు. గతంలో సచిన్ నెం.10 జెర్సీని శార్దూల్ ఠాకూర్ ధరించినప్పుడు కూడా ఫ్యాన్స్ ఇలాగే తీవ్రంగా స్పందించారు. దీన్ని బట్టి ఈ నంబర్లతో అభిమానులకు ఎంతటి ఎమోషనల్ కనెక్షన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ ఇంకా వన్డేలలో యాక్టివ్‌గా ఉన్నాడు కాబట్టి, ఈ జెర్సీ రిటైర్మెంట్ విషయంలో అధికారిక నిర్ణయం రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు.