సాధారణంగా పల్లెటూర్లలో గ్యాస్ బుకింగ్ చేస్తే రెండు మూడు రోజుల వరకు గ్యాస్ సిలిండర్  ఇంటికి రాదు. ప్రస్తుతం పల్లెల్లో కూడా కట్టెలపొయ్యికు బదులుగా గ్యాస్ స్టవ్ లనే  ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒకటే గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళు తరచూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఇక పట్నంలో అయితే గ్యాస్ బుక్ చేసిన మరుసటి రోజు మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇంటికి రావడం జరుగుతోంది. పల్లెల్లో అయితే కట్టెలపొయ్యి మీద చేసుకుని, సర్దుబాటు చేసుకోవచ్చు. మరిపట్నంలో అలా కుదరదు కదా! ప్రస్తుతం ఇలాంటి వారి కోసమే ఐవోసిఎల్ ఒక శుభవార్త చెప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళితే గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన ఒక  గంటలోనే  మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ కాబోతోంది.ఇందుకోసం ప్రముఖ oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) సంస్థ గ్యాస్ సిలిండర్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని, వారు పడుతున్న బాధలు దూరం చేయడం కోసం సరికొత్త సంచలనంతో  మన ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వారు తత్కాల్  సేవ ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ తత్కాల్ సేవలను అందించడానికి వీలుగా ప్రతి రాష్ట్రంలోనూ ఒక జిల్లాను లేదా ఒక పట్టణాన్ని ఇందుకు ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు.ఫలితంగా గ్యాస్ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు 30 నుంచి 40 నిమిషాల లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నట్టు  ఐఓసీఎల్  టాప్ మేనేజ్మెంట్ తెలిపింది.

ఇక ఈ తత్కాల్ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి అన్నది మాత్రం ఇప్పటివరకు నిర్ణయించబడలేదు. ప్రస్తుతం ఇండియన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు 14 కోట్ల మంది ఉన్నట్లు అంచనా.ఇప్పటికే ఈ ఇండియన్ ఆయిల్ తన కస్టమర్లకు ఇండేన్ గ్యాస్ రూపంలో ఎల్పిజి గ్యాస్ను అందిస్తోంది.తత్కాల్  సేవలతో సింగిల్ సిలిండర్ ఉపయోగించే వారికి ఊరట కల్పించనుంది ఐఓసీఎల్. ఒక త్వరలోనే గంటలోపే గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ కాబోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: