బుల్లితెరపై రియాల్టీ షోగా మంచి పాపులారిటీ సంపాదించింది బిగ్ బాస్ షో తాజాగా ఇప్పుడు 7వ సీజన్ చివరి ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది. దీంతో విన్నర్ కూడా ఎవరో తేలిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. రెండు శాతం ఓటింగ్ తో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారని సమాచారం.. అయితే బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ ఇంకా ఫినిష్ అవ్వడానికి కాస్త సమయం ఉన్నందువలన మిస్డ్ కాల్ హాట్ స్టార్ ఓటింగ్ లెక్కింపు ద్వారా చూస్తే రైతుబిడ్డ రాజయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోలో విన్నర్ గా నిలిచారని ప్రముఖ యూట్యూబర్ మహీధర్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ షోలో క్యాష్ ప్రైస్ ఆఫర్లు ఉన్నందువలన ఎవరైనా మనీ తీసుకుంటే మాత్రం అభిమానులకు కచ్చితంగా షాక్ తగిలే అవకాశం ఉన్నది.. ముఖ్యంగా టాప్-3 లో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానం ఉండగా అమర్దీప్ రెండవ స్థానంలో శివాజీ మూడో స్థానంలో ఉన్నట్లు తెలుస్తున్నది.బిగ్ బాస్ విజేతకు అవసరమైన అన్ని అర్హతలు కూడా శివాజీకి ఉన్నప్పటికీ కూడా కొన్ని తప్పుల వల్ల అతని పైన నెగెటివిటీ రావడం జరిగిందట.

అమర్దీప్ రెండవ స్థానంలో నిలవడం మరికొంత మందికి షాకిస్తోంది. అమర్దీప్ కు ఊహించని స్థాయిలో మంచి పాపులారిటీ రావడం వల్లే రన్నర్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఈ సీజన్ ఉల్టా ఫాల్తా సీజన్ కావడం చేత నాగార్జున ప్రైజ్ మనీ విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రియాంక జై నాల్గవ స్థానంలో యువర్ ఐదవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తున్నది.. అర్జున్ అంబాటి ఆరవ స్థానంలో ఉన్నట్లు సమాచారం.. ముఖ్యంగా బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ ఉన్న సైతం చూడడానికి చాలామంది ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: