అవును.. నిజంగానే ఆపిల్ సంస్ద విద్యార్థులకు సూపర్ ఆఫర్ ఇస్తుంది. ఏంటి అంత సూపర్ ఆఫర్ అని అనుకుంటున్నారా? అదేనండి.. బ్యాక్-టు-స్కూల్ ప్రమోషన్లో భాగంగా విద్యార్థుల కోసం హెడ్ ఫోన్లను ఆపిల్ కంపెనీ ఆఫర్ ఇస్తుంది. ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ లో విద్యార్థులు, టీచర్లు 899 డాలర్ల ధరతో మాక్‌బుక్ ఎయిర్ లేదా 479 డాలర్ల విలువ చేసే ఐప్యాడ్ ఎయిర్ గానీ కొంటే సెకండ్ జనరేషన్ ఎయిర్పాడ్లను ఉచితంగా ఇస్తుంది.
అంతేకాదు దీనితో పాటు 40 డాలర్ల విలువ గల వైర్లెస్ ఛార్జింగ్ కేసుతో ఎయిర్‌పాడ్స్‌కు అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఆపిల్ అందిస్తుంది. ఇంకా అంతేకాదు కేవలం 90 డాలర్లతో ఎయిర్‌పాడ్స్ ప్రో కొనుగోలు చేసుకునే అవకాశం ఇస్తుంది. ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్ బుక్ ఎయిర్ ఈ ఒప్పందానికి ఎంట్రీ పాయింట్ ఇవ్వనుంది. ఇంకా 2020 ఐప్యాడ్ ప్రో పలు సైజుల్లో మాక్‌బుక్ ప్రోలతో ఉచిత హెడ్ఫోన్లను పొందవచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే మాక్ బుక్ ని కోనేయండి.
అయితే అద్భుతమైన ఆఫర్లు ఏయే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై ఉన్నాయో ఓ సారి ఇక్కడ చదివి తెలుసుకోండి.. 21.5-అంగుళాల లేదా 27-అంగుళాల ఐమ్యాక్, 27-అంగుళాల ఐమాక్ ప్రో, 13.3-అంగుళాల మాక్‌బుక్ ఎయిర్, 13.3-అంగుళాల మాక్‌బుక్ ప్రో, 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో, 10.5-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్, 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో (2020), 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో (2020) ఆఫర్లు ఎక్కువగా ఉన్నాయ్.