నిజం చెప్పాలి అంటే, రైలు బ్రేకులు ఎప్పుడు ఆన్ లోనే ఉంటాయి. కేవలం రైలు కదులుతున్న సమయంలో మాత్రమే బ్రేక్ లు తీసివేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైలు నడిపే లోకో పైలెట్ లు అయితే రైలు నడిపేటప్పుడు గాలి ఒత్తిడి ద్వారా ఆ చక్రాల నుంచి బ్రేకులు తీసివేస్తారు. ఒకవేళ రైలు కనుక ఆపవలసి వస్తే, అప్పుడు ఈ చక్రాలకు గాలి ఇవ్వడం మానేస్తారు.ఇక రైలు ఆగినప్పుడు రైలు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వెలువడడం మనం గమనించవచ్చు. అయితే చక్రాల నుంచి గాలిని తీసేస్తే , అప్పుడు ఆటోమేటిక్ గా బ్రేకులు పడతాయి..
ముఖ్యంగా జనరల్ కోచ్ రైలు టైర్లలో బ్రేకులు చాలా వేగంగా పడతాయి. ఎందుకంటే ఈ జనరల్ కోచ్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. తద్వారా బ్రేక్ అలాగే చక్రాలకు మధ్య ఉన్న దూరం కూడా తగ్గుతుంది. ఇక ఫలితంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇక ఎప్పుడైతే బ్రేక్ వేయవలసి వస్తుందో , అప్పుడు రబ్బరు కాలిపోయిన వాసన మనకు వస్తుంది. రైలు నడిపేటప్పుడు లోకో పైలెట్ చాలా అప్రమత్తంగా ఉండాలి .లేకపోతే బ్రేకులు పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో లోకో పైలెట్ లో ఏం చేసినా కూడా ఇంజన్ కు తెలుస్తుంది. అంటే బ్రేకులు వేయడం, హార్న్ కొట్టడం, వేగం పెంచడం లాంటి పనులు చేసినప్పుడు లోకో పైలెట్ కూడా యాక్టివ్ గా ఉన్నాడని ఇంజన్ కు తెలుస్తుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి