ఈమధ్య ఎక్కువగా చాలామంది సైతం ఎలక్ట్రిక్ వెహికల్స్ సైడే మక్కువ చూపుతున్నారు.. ముఖ్యంగా లోకల్లో తిరిగేవారు చౌక ధరకే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి మక్కువ చూపుతున్నారు..అతి తక్కువ ధరకే ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ కొనాలని చూస్తున్న వారికి.. ప్రముఖ బ్రాండెడ్ నుంచి ఒక స్కూటర్ మనకి అందుబాటులోకి రావడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ మోడల్ బైక్ కొనుక్కుంటే ఎలాంటి ఉపయోగకరాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.


రూ.55 వేల బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందంటే చాలు చాలామంది ప్రజల సైతం వీటిని కొనడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు. దీని పేరే మూలువీన్ ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ ఆటో దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత వీటికి రిజిస్ట్రేషన్ అవసరము ఉండదు.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేకుండా ఎక్కడికైనా సరే మనం హ్యాపీగా వెళ్లవచ్చు. అయితే ఈ స్కూటర్ని మాత్రం కొనుగోలు చేయాలి అంటే ఆన్లైన్లో లేకపోతే అధికారిక వెబ్సైటు ద్వారా వెయ్యి రూపాయలతో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Emi ఆప్షన్లు కూడా లభిస్తాయి. నెలవారి ఈఎంఐ ఆప్షన్ 2000 రూపాయల వరకు మొదలవుతుంది డౌన్ పేమెంట్ కింద 10వేలు కట్టాల్సి ఉంటుంది.. ఇక బైకు యొక్క స్పీడ్ విషయానికి వస్తే గంటకి 25 కిలోమీటర్లు చొప్పున వెళుతుందట. అలాగే ఒక్కసారి చార్జింగ్ చేసినట్లు అయితే దాదాపుగా 60 కిలోమీటర్ల వరకు ఈ బైక్ ప్రయాణించగలరని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు.అయితే ప్రస్తుతం ఈ బైక్ కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని డీలర్ షిప్పులకు సైతం అందజేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ బైక్ కస్టమర్లను సైతం ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: