
అలా పడిన 12 గంటల తర్వాత అది తుఫాన్ గా మారి అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపుగా వెళుతుందని.. అమరావతి వాతావరణ శాఖ వారు తెలియజేశారు. ఈ రోజున బుధవారం మయన్మార్ సమీపంలో తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. తుఫాన్ ఏర్పడిన కారణంగా సోమవారం రోజున పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయట. మదనపల్లి లో 65.5 మిల్లీ మీటర్ల వర్షపాతం.. విశాఖ పట్టణంలోని నర్సీపట్నంలో 38.75 మీటర్లు.. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో 37 మీటర్లు తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరంలో 35 మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రికార్డులు తెలియజేయడం జరిగింది.
ప్రకాశం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో ఈ భారీ వర్షం కురుస్తోంది.. విశాఖ మన్యంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల నర్సీపట్నం, కొయ్యూర్, పాడేరు, హుకుంపేట, కోటవురట్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడటంతో అక్కడ ఉండి తోటలు, పంట పొలాలు దెబ్బతిన్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం గుమ్ములూరు వద్ద, విజయనగరంలోని ఒక మోస్తరుగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలను చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులతో హెచ్చరించడం జరుగుతున్నది. ఏది ఏమైనా ఈ రెండు రోజులు ప్రజలు బయటికి రాకుండా ఉండడం మంచిది.