
పుట్ట్ బాల్ ఆటలో భాగంగా ఆటగాడు ఎల్స్ఫ్ బోర్గ్ జట్టుకి చెందిన డిపెండర్ సైమన్ స్టాండ్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. సైమన్ స్టాండ్ ఫుట్‌బాల్‌ను కిక్ చేయాలనుకుని అదుపు తప్పి సైడ్‌లైన్ మీదకు వెళ్లబోయి.. అప్పటికే బంతిని కిక్ చేసిన సైమన్ వేగంతో ముందుకు వెళ్ళాడు దాంతో కాస్త స్లిప్ అయ్యి అక్కడే ఉన్న కెమెరా ఉమెన్ వైపుకు పడిపోతుండగా అది గమనించిన ఆ కెమెరా ఉమెన్ అదృష్టవశాత్తు అక్కడ నుండి పక్కకు తప్పుకుంది. దాంతో ప్రమాదం కాస్త తప్పింది. కెమెరా మాత్రం తలకిందులుగా పడింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్రుటిలో ప్రమాదం తప్పడంతో అక్కడున్నవారు ఊపిరిపీల్చుకున్నారు.
అయితే ఆ ఘటన జరిగిన సమయంలో పక్కనే ఉన్నటువంటి అలీరెజా కెమెరా ఉమెన్ దగ్గరకు పరుగున వచ్చి కెమెరాను సరిచేసి.. ఎలా ఉందండి..? ఏమి ఇబ్బంది లేదు కదా దెబ్బలు తగ్గేలా లేదుగా అని పరామర్శించారు. అందుకు ఆ కెమెరా ఉమెన్ లేదండి అంత బాగానే ఉంది పర్లేదు అని సమాధానం ఇచ్చింది. అలాగే సైమన్‌ను పక్కకు తీసుకెళ్ళి కాస్త చూసుకోవాలిగా, ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది అన్నట్లుగా మాట్లాడి సైమన్ ను అక్కడ నుండి పంపించాడు అలీరెజా. అయితే అలీరెజా స్పందించి మహిళ వద్దకు వెళ్లి ఆమెకు ఎలా ఉందని తెలుసుకోవడం పట్ల నెటిజన్లు సంతోషంతో ప్రశంసలు కురిపిస్తున్నారు. న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.