ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు వరుసగా నోటిఫికేషన్లను వెలుబడుతూనే ఉన్నాయి. అటు కేంద్రం నుంచి.. ఇటు రాష్ట్రాల వారీగా పలు రకాల పోస్టులను విడుదల చేస్తూ ఉన్నారు. తాజాగా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ..2023-2024  ను ప్రవేశ పెట్టడం జరిగింది. తమ ప్రభుత్వ హయామం లో సాధించిన ప్రగతిని.. వార్షిక బడ్జెట్లో పలు రకాలుగా కేటాయింపులు తదితర అంశాల పైన ప్రసంగాన్ని వివరిస్తున్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్లో వచ్చే మూడు సంవత్సరాలలో3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తున్న 740 పాఠశాలలకు కేంద్రం 38,800 మంది ఉపాధ్యాయులను, సహాయక సిబ్బందిని నియమించబోతున్నట్లు నిర్మల సీతారామన్ తెలియజేసింది.

ఇక అందుకు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో ట్విట్టర్లో ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇక సమాచారం అందుతున్న మేరకు  పోస్టు యూజర్స్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుంచి నేరుగా తెలియజేయడం జరిగింది. అలాగే వీటితో పాటు కొన్ని కొత్త నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు.157 కళాశాలను 2014 నుంచి ఏర్పాటు చేశామని తెలియజేశారు. అలాగే గత ఆర్థిక సంవత్సరాలలో దేశ తలసరి ఆదాయం కూడా పెరిగిందని తెలియజేసింది .

రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు మరొక ఏడాది పొడగింపు తో పాటు రైల్వేకు రూ.2.4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. అలాగే గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం అభివృద్ధి మిషన్ ని ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన తండా గూడెంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం రూ.15,000 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. దళితుల అభివృద్ధికి ప్రత్యేకమైన పథకాలను కూడా చేపట్టబోతున్నట్లు తెలియజేశారు. అలాగే పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పీఎం మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్య కారుల వ్యాపారాల కోసం ఈ పథకాన్ని తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. మరిన్ని.. బడ్జెట్  లో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: