ఎవరికైనా తమ జీవితంలో విజయం అందుకోవాలని ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ విజయం కొరకు పరుగులు తీస్తూ ఉంటారు. అయితే పరిస్థితుల ప్రభావం కారణంగా వాటిని తాళలేక కొందరు మధ్యలోనే విరమించగా, మరి కొందరు అన్నిటినీ అధిగమించి కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇలా విజయం కోసం పయనించే సమయంలో మిత్రులతో పాటు శత్రువులు కూడా ఏర్పడతారన్న విషయం తెలిసిందే. అయితే మిత్రుల మనసు మరింత గెలుచుకుని వారిని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో అలాగే శత్రువులను ఓడించి వారిని దాటుకుని వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. మీలో కనుక కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే ఎంతటి శక్తివంతమైన శత్రువును కూడా ఓడించగలుగుతారు. అయితే అందుకు మీరు నాలుగు విషయాలను తెలుసుకుని గుర్తుంచుకోండి. వాటిని మీ శత్రువు పై గురిపెట్టండి... శత్రువును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.

శాంతం: తన కోపమే తన శత్రువు, తన శాంతమే  తనకు రక్ష అన్నారు పెద్దలు. అలాగే మనమంటే గిట్టని వారిని సైతం మనం మనకు దగ్గరయ్యే విధంగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. కుదరని పక్షంలో వారికి దీటుగా నిలబడి అధిగమిస్తూ పయనం కొనసాగించాలి.

దైర్యం: ధైర్యాన్ని ఎప్పటికీ వీడకూడదు. మీ పాజిటివ్ నేచర్ మీకు ఎంతగానో సహాయం చేస్తుంది. దైర్యంగా ఉంటూ మన వల్ల అవుతుంది అనుకుంటే పని సులువుగా అనిపిస్తుంది.  

అంచనా: శత్రువును బలహీనంగా అనుకొనవద్దు. ఏ శత్రువు అయినా సరే వారిని తక్కువగా అంచనా వేయకండి. శత్రువును తక్కువ అంచనా వేసి తీరిగ్గా వుంటే అతడు చేయాల్సింది చేసేసి... మనల్ని దాటుకు పోతాడు.  మీకంటే బలహీనుడు అయినా సరే ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

ముందు చూపు: ఉద్యోగమైనా, వ్యాపారమైనా రెండింటి లోనూ మీకంటూ ఒక ప్రణాళిక ఉండాలి. దూర దృష్టి అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రతిసారి ఉండవు. అన్ని సమయాలు మనవి కావు అందుకే ముందు జాగ్రత్త చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: