జర్మన్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ పోర్షే.. కొత్త మకాన్ టర్బో ఎలక్ట్రిక్ SUVని నేడు రిలీజ్ చేసింది.ఈ కొత్త పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ SUV ధర రూ. 1.65 కోట్లు. పోర్షే మకాన్‌ ఎలక్ట్రిక్‌ కారును కంపెనీ మకాన్‌ 4(Macan 4), మకాన్‌ టర్బో అనే రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది. బుకింగ్‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. డెలివరీలు ఈ ఇయర్ సెకండ్ ఆఫ్ లో ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.ఈ కార్ పెట్రోల్ మోడల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకంగా నాలుగు-పాయింట్ LED DRLలు, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌లు ఇంకా ఫ్రేమ్‌లెస్ డోర్లు ఉన్నాయి. ఇంకా వెనుకవైపు కనెక్ట్ చేయబడిన LED బార్, కూపే-స్టైల్ బాడీతో పాటు ఆకర్షణీయమైన 22-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ కార్ వస్తుంది.కొత్త పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ SUV ఇంటీరియర్‌ విషయానికొస్తే.. క్యాబిన్‌ను చాలా లగ్జరీగా విశాలవంతంగా డిజైన్ చేశారు. ఫీచర్ల పరంగా ఈ కార్ 12.6-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇంకా ఎయిర్‌కాన్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్లు కూడా ఉన్నాయి.హెడ్స్-అప్ డిస్‌ప్లే ఇంకా ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఆప్షనల్‌గా 10.9-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తోంది.


కొత్త పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ SUV కార్ లో ఆప్షనల్‌ రియర్ వీల్ స్టీరింగ్ సదుపాయం ఉంటుంది. ఇంకా పోర్షే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌మెంట్‌తో పాటు పోర్షే ట్రాక్షన్ కంట్రోల్ వంటి సూపర్ ఫీచర్లను కూడా ఈ కార్ కలిగి ఉంది.పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ SUV కార్ ని 800-వోల్ట్ PPE ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించారు. ఇందులో 100 kWh బ్యాటరీ ప్యాక్‌ను స్టాండర్డ్‌గా వాడారు. ఇక పోర్షే మకాన్‌ 4 613 కి.మీ రేంజ్‌ను ఇస్తుండగా. ఇంకా మకాన్ టర్బో వేరింయట్‌లో పూర్తి ఛార్జింగ్‌పై 591 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది.ఇక ఛార్జింగ్ ఆప్షన్ల విషయానికి వస్తే పోర్షే మకాన్‌ టర్బో ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలో 11 kW AC ఛార్జింగ్ ఇంకా 270 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తున్నారు. వీటిలో డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కేవలం 21 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం దాకా ఛార్జ్ చేస్తుంది. ఇక ఈ టర్బో ఎలక్ట్రిక్ SUV రెండు వేరియంట్లలో డ్యూయల్-మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది.పోర్షే మకాన్‌ టర్బో వేరియంట్ 630 బీహెచ్‌పీ ఇంకా 1,130 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 3.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ SUV  గంటకు మాక్సిమం 260 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: