స్ట్రెస్ అనేది మీ ఫిజికల్ అపియరెన్స్ తో పాటు మెంటల్ హెల్త్ పై కూడా అనేక రకాలుగా ప్రభావం చూపుతుందని గమనించాలి. స్ట్రెస్ వలన మీ ముఖంపై మొటిమలు వస్తాయని మీకు తెలుసా? హార్మోన్ల ప్రభావమనుకుని మీరు సాధారణంగా పింపుల్స్ ఎందుకొచ్చాయన్న విషయాన్ని పట్టించుకోకపోవడం జరుగుతుంది. డెడ్ లైన్ ను మీటవడానికి రాత్రంగా మెలకువగా ఉండి వర్క్ ప్రెజర్ తో మీరు సతమతమై ఉండవచ్చు. ఎంతో యాంగ్జైటీకి గురై ఉండవచ్చు. ఆ విషయాన్ని మీరు మరచిపోయి ఉంటారు. రాత్రిపూట మీరు పడిన స్ట్రెస్ అంతా ఉదయాన్నే మొటిమల రూపంలో మిమ్మల్ని పలకరిస్తుంది.

ఒత్తిడిని ఫీలైనప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజవుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువవుతుందో అప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ మరింత ఎక్కువవుతాయి. ఈ హార్మోన్ అనేది చర్మంపై ఆయిల్ ప్రొడక్షన్ ను పెంచుతుంది. చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలను తెప్పించే బాక్టీరియా అనేది చేరుతుంది. రాత్రంతా మెలకువగా ఉండటం వల్ల పింపుల్స్ సమస్య కచ్చితంగా వస్తుందంటున్నారు నిపుణులు.

నిజానికి మొటిమలనేవి వివిధ కఠినమైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడుక వల్ల తలెత్తే సమస్య అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రకాల ఫుడ్స్, ప్రొటెక్టివ్ మాస్కులు అలాగే హార్మోన్లలో మార్పులు ఇవన్నీ కూడా మొటిమలకు దారితీస్తాయి. మరి వీటికి అలాగే స్ట్రెస్ యాక్నేకు మధ్య డిఫరెన్స్ ను ఎలా కనుక్కోగలుగుతాము?

మీరు మీ శరీరమిచ్చే సూచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు స్ట్రెస్ కు గురైనప్పుడు పింపుల్స్ ను గుర్తించడం ప్రారంభిస్తే అవి స్ట్రెస్ కి సంబంధించినవని గమనించాలి.  ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. నిద్రలేమి, విపరీతమైన పని ఒత్తిడి ఇవన్నీ స్ట్రెస్ యాక్నేకు దారితీస్తాయి.

అలాగే, స్ట్రెస్ పింపుల్స్ అనేవి ముఖంపై ఆయిలీ ప్రదేశాల్లో ఎక్కువగా వస్తాయి. నుదురు, గడ్డం అలాగే ముక్కు ఇలా ఈ ఏరియాస్ లో ఎక్కువగా స్ట్రెస్ పింపుల్స్ ను నోటీస్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: