భారతదేశంలో సినీ ఇండస్ట్రీ చాలా బలంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసి అద్భుతమైన హిట్స్ సాధిస్తున్నారు. అలాంటి సినీ ఫీల్డ్ లో అత్యంత అప్డేట్ గా ఉండేటువంటి ఇండస్ట్రీ  బాలీవుడ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న ఫ్యామిలీ అంటే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఇప్పటికే అమితాబ్ నటవారసుడిగా అభిషేక్ బచ్చన్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఇండస్ట్రీలో రాణిస్తూ  ఉన్నారు. అయితే అభిషేక్ బచ్చన్ సినిమాల్లో వచ్చిన పేరు కంటే ఆయనపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లతోనే మంచి పేరు సంపాదించాలని చెప్పవచ్చు. 

ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలోని కరిష్మా కపూర్, రాణి ముఖర్జీ వంటి వారితో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ చివరికి ఐశ్వర్యారాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి అభిషేక్ బచ్చన్ ఒకానొక సమయంలో ఒక హీరోయిన్ ని డైరెక్ట్ నీతో పడుకుంటానని అడిగారట. ఆ హీరోయిన్ ఎవరు ఆ వివరాలు చూద్దాం.. అది 1982 కాలం.. అప్పుడు అమితాబ్ బచ్చన్ స్టార్ హీరో..ఆ సమయంలో జీనత్ అమన్ తో జతకట్టి  వరుసగా హిట్లు సాధించాడు. ఇదే సమయంలో మహాన్ సినిమా షూటింగ్ కోసం అమితాబ్ బచ్చన్ ఖాట్మండు కి వెళ్లారు. ఆయనతోపాటు తన కుమారుడైన అభిషేక్ బచ్చన్ ని కూడా తీసుకెళ్లాడు.
అయితే జీనత్ తో అమితాబ్ బచ్చన్ షూటింగ్ ముగిసిన తర్వాత  రాత్రి 9 గంటల వరకు ఎవరి గదుల్లో వారు పడుకోడానికి వచ్చారు. కానీ అందులోని ఒక గదిలో సినిమా వారంతా కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. అందులో ఉండే ఒక సోపాలు మూలన అభిషేక్ బచ్చన్ కూర్చొని ఉన్నాడు. కాస్త రాత్రి అవ్వడంతో జీనత్ లేచి తన గది వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ టైంలోనే అభిషేక్ బచ్చన్ లేచి  ఎక్కడికి వెళ్తున్నావ్ అని  ప్రశ్నించాడు. వెంటనే జీనత్ నా రూమ్ కి పడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పింది. దీంతో అభిషేక్ బచ్చన్ నీతో నేను పడుకుంటానని తన కోరికను బయటపెట్టాడు. ఈ మాట విన్న జీనత్ చాలా నవ్వి  అభిషేక్ బచ్చన్ బుగ్గలు నిమిరి నువ్వు ముందు పెద్దగా ఎదుగు ఆ తర్వాత నేనే వచ్చి నీతో పడుకుంటానని చెప్పింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సరదాగా బయట పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: